ఎన్నికల ముందు హైదరాబాద్ ప్రజలపై వరాలు

-విద్యుత్తు, నల్లా బకాయిలు రద్దు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సమీపించడంతో హైదరాబాద్ మహానగర పరిధిలోని పేదలపై తెలంగాణ సర్కారు వరాలు కురిపించింది.. విద్యుత్, నల్లా బకాయిల రద్దు కు నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయం వల్ల దాదానె 9 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  టీఆర్ఎస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం..

ఈ నిర్నయం వల్ల ఖజానాపై రూ.423 కోట్లు భారం పడనున్నా సర్కారు ముందడుగు వేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ నిర్ణయం అమలు సాధ్యం కాదు.. ఎన్నికల కోడ్ అనంతరం అమలు కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు త్వరలో ఆస్తి పన్ను రాయితీపైనా నిర్ణయం తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *