ఎన్నికల టైం చూసి కొట్టిన రాధాకృష్ణ

maxresdefault

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరంగల్ ఉప ఎన్నిక వేళ అదునుచూసి కొట్టాడు ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ. టీఆర్ఎస్ కు ఓట్లు రావద్దనే ఉద్దేశంతో ఈరోజు ఓ కథనాన్ని వండివార్చాడు.. ఈసీకి కేసీఆర్ టోకరా అంటూ ఎన్నికల అఫిడవిట్ కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపాడని.. ఎన్నికల ఖర్చు కింద కేసీఆర్ కు కోటి పార్టీ ఫండ్ ఇస్తే 30 లక్షల రూపాయలు గల్లంతు అయ్యాయని.. పార్టీ ఇచ్చినట్టు చెబతే.. కేసీఆర్ ఇవ్వలేదని చెప్పి అక్రమాలకు పాల్పడ్డాడని ఆంధ్రజ్యోతి ఆరోపించింది.
కేసీఆర్ ను అనర్హుడిగా ప్రకటించాలని.. పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. రేపు కేసీఆర్ కూతురు కవిత ఎన్నికల ఖర్చు, అక్రమాలపై కథనం ప్రచురిస్తామని పేర్కొంది..

0123

దీంతో కాంగ్రెస్ , టీడీపీ, బీజేపీ చేయని పనిని ఆంధ్రజ్యోతి చేసి టీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. వరంగల్ ఉప ఎన్నికల వేళ అదును చూసి కొట్టి భలే దెబ్బతీసిందని కాంగ్రెస్ వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *