ఎన్నాళ్లీ వాయిదాలు..

తెలంగాణ నిరుద్యోగుల కష్టాలు తీరడం లేదు.. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు గ్రూప్ పరీక్షలకు మోక్షం కలిగింది. తెలంగాణ ఏర్పడ్డ రెండేళ్లకు నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఈ పరీక్షల్లో ప్రతిపక్షాలు, నిరుద్యోగులు పోస్టులు పెంచాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తులు చేశాయి. దీంతోపాటు ఆర్ ఆర్ బీ పోస్టులకు పరీక్షలు ఉండడంతో కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేశారు..

కాగా గ్రూప్ 2 పరీక్షలకు పెంచేందుకు కేసీఆర్ నిర్ణయించారు. జోన్ 5.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కేవలం 90 పోస్టులే ఉండడంతో అభ్యర్థులు కేసీఆర్ కు పోస్టులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేశారు. పోస్టులు పెంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *