Breaking News

ఎన్నడూ కనపడని మోహాలను వింతగా చూశారు..

rahul-gandhi-ap-650_650x400_61437753536

అనంతపురం : సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కనీసం మొహం చూపించడానికి కూడా ఇష్టపడని మొహాలు అనంతపురంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఏపీ ప్రజలకు కనిపించాయి.. విమర్శలకు వెరసి.. గొడవలకు జడిసి ఇన్నాళ్లు నవ్యాంధ్ర మొహం చూడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు  రాహుల్ వల్ల ప్రజల్లోకి వెళ్లే అవసరమొచ్చింది.. నిన్న రాహుల్ పాదయాత్రలో విభజన జరిగినప్పటినుంచి కనపడని ఎంపీ, సినీ నటుడు చిరంజీవి కలియతిరిగారు. అన్నీ తానై వ్యవహరించారు.

ప్రజల మధ్య తిరిగిన రాహుల్ కు జనం బ్రహ్మరథం పట్టారు. ఒక్కొక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబానికి రాహుల్ 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఇదే రాహుల్ గాంధీ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడం గమనార్హం.

ముఖ్యంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరా, చిరంజీవిలు కాంగ్రెస్ ముఖ్యులుగా కనిపించగా.. అనంతపురం కాంగ్రెస్ నేత శైలజానాథ్ గైర్హాజరవడం.. ఆయన పార్టీ మారేందుకు రెడీ చేసుకున్నట్లు సమాచారం.  ఎన్నడూ కనిపించని మొహాలు కనిపించే సరికి ఏపీ ప్రజలు కూడా అభిమానం చూపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *