
శ్రీమంతుడు కథను ఎన్టీఆర్ కు చెప్పాడు కొరటాల శివ.. కొంచెం టైం తీసుకొని చేద్దాం అన్నాడు ఎన్టీఆర్.. రాంచరణ్ కు వినిపించాడు.. ఇది నాకు సూట్ కాదంటూ తిప్పి పంపేశాడు.. అదే స్టోరీని మహేశ్ చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
శ్రీమంతుడు మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఇఫ్పుడు ఎన్టీఆర్ తెగ బాధపడిపోతున్నాడట.. ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాకు కొరటాల శివ మాటలు రాశారు.. ఆ పరిచయంతోనే ఎన్టీఆర్ కు శ్రీమంతుడు కథ చెబితే ఆయనకు నచ్చలేదట.. ఇక రాంచరణ్ అయితే బాలేదని చెప్పేశాడట.. మిర్చితో హిట్ కొట్టిన కొరటాల శివను అంత తేలికగా నమ్మలేదు రాంచరణ్, ఎన్టీఆర్.. కానీ మంచి ఫీల్ గుడ్, కుటుంబ నేపథ్యాలున్న ఈ మూవీ మహేశ్ చేసి భారీ హిట్ కొట్టాడు..