
వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండల బంధనపల్లికి చెందని శ్రీనిధి(10) బ్లడ్ క్యాన్సర్ తో మృతి చెందింది. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి కోరిక మేరకు మేక్ ఏ విష్ సంస్థ సంప్రదించగా ఇటీవలే ఎన్టీఆర్ బాలికను పరామర్శించి ఆమె కోరిక తీర్చారు.
మంగళవారం అర్ధరాత్రి కూకట్ పల్లి రామ్ దేవ్ రావు ఆస్పత్రిలో చిన్నారి శ్రీనిధి కన్నుమూసింది. ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యలు స్వస్థలం బంధనపల్లికి తరలించారు.