Breaking News

ఎన్టీఆర్ ‘టెంపర్’ సాంగ్స్ రిలీజ్

Ntr temper

హైదరాబాద్, ప్రతినిధి :  పూరిజగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా ఆడియో ఈరోజు హైదరాబాద్ లో విడుదలైంది. అంతకుముందు సినిమా టైటిల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. ‘నీతాత టెంపర్.. నీ అయ్య టెంపర్.. బాబాయి టెంపర్..’ అంటూ సాగే ఈ పాటకు రిలీజ్ అయిన కొద్ది సేపటికే చాలా హిట్స్ రావడం విశేషం. ఈ పాటకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ యూట్యూబ్ లో టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. టెంపర్ సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *