
వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ తేమ శాతం లేకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. దేశంలోనే వరంగల్ పత్తి నాణ్యత కు మారుపేరన్నారు. ప్రతి రైతుకు మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు, ఏ రైతు రోజుల తరపడి వేచి చూడకుండా ఉండేందుకు సీసీఐ కి అదనపు ఉద్యోగుల నియమిస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు హమీ ఇచ్చారు. ప్రతి రైతు పత్తిని మార్కెట్లోనే కొనుగోలు చేసే విదంగా కృషి చేస్తామన్నారు. క్వింటాల్ పత్తికి ప్రభుత్వ కనీస మద్దతు ధర ఐదు వేల ఐదువందల యాభై రూపాయలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ , జాయింట్ కలెక్టర్ దయనంద్, మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.