
ప్రాణహిత పై ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు మహారాష్ట్ర మోకాలడ్డింది.. ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లతో నిర్మించాలనుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ససేమిరా ఒప్పుకోనంది.148 మీటర్లకు మించరాదని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ ల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి..
మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల హైదరాబాద్ లో జరిగింది.బ్యారేజీ 152 మీటర్ల ఎత్తుపెంపుతో మహారాష్ట్రలో ముంపు ముప్పు ఎక్కువగా ఉంటుందని అందుకే 148 మీటర్లకే పరిమితం కావాలన్న మహారాష్ట్ర ఒత్తిడిని తెలంగాణ అధికారులు తిరస్కరించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి..