Breaking News

ఎడిషన్ ఇన్ చార్జులను లేపడానికేనా..

sakshi-building

సాక్షిలో ఇప్పుడు కొత్త గా సీనియర్ సబ్ ఎడిటర్లకు శిక్షణ ఇస్తున్నారట.. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తున్నారు. గతంలో ట్రైనింగ్ లంటూ భారీ జీతం గల వారిని లేపిన చరిత్ర సాక్షి యాజమాన్యంకు ఉంది. ఇప్పుడు మళ్లీ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సీనియర్ సబ్ ఎడిటర్లు, 2వ ఇన్ చార్జులకు ఇటీవల సాక్షి హైదరాబాద్ లో ట్రైనింగ్ సెషన్ నడిచింది.. కాగా శిక్షణలో వీరికి అన్ని విధాల సహకరించిందట యాజమన్యం..

ప్రస్తుతం సాక్షిలో ఎడిషన్ ఇన్ చార్జులకు సగటున కొందరికి 30వేల వరకు జీతాలున్నాయి. సీనియర్ సబ్ ఎడిటర్లకు 20 వేల వరకు ఉన్నాయి. అందుకే ఎడిషన్ ఇన్ చార్జుల ట్రాన్స్ ఫర్లను త్వరలో చెయ్యబోతున్నారట.. ఇలా బదిలీల పేరుతో వారిని లేపేసి కొత్తవారికి ఇస్తే జీతము ఆదా అవుతుందని సాక్షి యాజమాన్యం ప్లాన్ వేసిందని భోగట్టా.. అందుకే సీనియర్లకు శిక్షణ పేర పిలిపించి చురుగ్గా ఉన్న వారిని ఎడిషన్ ఇన్ చార్జులుగా చేయడానికే ఈ కొత్త ట్రైనింగ్ అని ఇన్ సైడ్ టాక్..

30వేల జీతం ఉన్న ఇన్ చార్జులను బదిలీల పేరు సాగనంపితే సీనియర్ సబ్ ఎడిటర్లు 20వేలకే ఆ పోస్టులకు పంపవచ్చు. దీంతో సాక్షి యాజమాన్యంకు 10వేల వరకు ఎడిషన్ కు ఆదా అవుతుంది. త్వరలో బదిలీల పర్వంలో బాగంగానే ట్రైనింగ్ లు నిర్వహిస్తున్నారని సాక్షి హెడ్ ఆఫీసులో చెవులు కొరుక్కుంటున్నారు.

సో సాక్షిలో మరో సంక్షోభానికి తొందరలోనే తెర తీయబోతున్నారట.. ప్రతీ సంవత్సరానికోసారి సాక్షిలో సంస్కరణలు అమలు కాకపోతే వారికి నిద్రనే పట్టదనుకుంటా.. వారి చర్యలతో ఇప్పుడు సంస్థలో ని సబ్ ఎడిటర్లకు, రిపోర్టర్లకు సైతం నిద్ర కరువవుతుండడం కొసమెరుపు…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *