Breaking News

‘ఎట్ హోం’లో మళ్లీ కలిసిన ఇద్దరు చంద్రులు

telangana-ap-cm

-లొల్లి వద్దు.. సామరస్యం ముద్దు అన్న గవర్నర్
-త్వరలో ముఖాముఖి భేటికి సీఎంల నిర్ణయం
హైదరాబాద్, ప్రతినిధి : చర్చలు ముద్దు.. గొడవలు వద్దు అన్నారు గవర్నర్ నరసింహన్. సామరస్యంగా పరస్పరం సహకరించుకొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు సూచించారు. గవర్నర్ సూచన మేరకు వివాదాస్పద అంశాలపై త్వరలోనే భేటి నిర్వహిస్తామని ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  సోమవారం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రులు ఇద్దరూ రాజ్ భవన్ లో భేటి అయ్యారు. ఎంసెట్ వంటి సున్నితమైన అంశాల విషయంలో ఏకాభిప్రాయానకి రావాలని, దీనివల్ల లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని గవర్నర్ వారికి హితవు పలికినట్లు చెప్పారు. సీఎంల సమావేశానికి త్వరలోనే ఒక తేదిని ఖరారు చేస్తామని వెల్లడించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *