Breaking News

ఎట్టకేలకు తెలుగు వారియర్స్ సాధించారు

హైదరాబాద్, ప్రతినిధి : ప్రతీసారీ ఫేవరెట్ గా బరిలోకి దిగడం ఓడిపోవడం.. ఇలా సీజన్ సీజన్ లో నిరాశనే ఎదుర్కొన్న తెలుగు వారియర్స్ ఎట్టకేలకు సెలబ్రటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) కప్పు ఎట్టకేలకు అందుకున్నారు. ఐదేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న సెలబ్రటీ లీగ్ టాలీవుడ్ వశమైంది.

ప్రతీసారీ ఓడిపోవడంతో ఈ సారి తెలుగువారియర్స్ కెప్టెన్ వెంకటేశ్ సీనియర్ క్రికెటర్ వెంగ్ సర్కార్ తో జట్టుకు కోచింగ్ ఇప్పించారు. అది పనిచేసింది. బలమైన కర్ణాటకను సెమీస్ లోనే మట్టికరిపించిన తెలుగు వారియర్స్ ఫైనల్ లో చైన్పైని మట్టికరిపించి కప్ గెలుచుకుంది.

ఫైనట్ మ్యాచ్ లో టాస్ గెలిచి అఖిల్ మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. టాలీవుడ్ బౌలర్లకు కట్టుదిట్టమైన బౌలింగ్ కు 133 పరుగులకే చైన్నై అలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన తెలుగు టీం ఫ్రిన్స్ 15, సచిన్ జోషి 37, అఖిల్ 32 పరుగులు చేసి లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించారు. ఈ మ్యాచ్ లో అఖిల్ బ్యాటింగ్ ప్రదర్శన ఆకట్టుకుంది. అఖిల్ సిక్స్ కొట్టినప్పుడు వెంకటేశ్, నాగార్జున స్టెప్పులేశారు. గెలుపు అనంతరం మైదానంలో తెలుగు తారలంతా డ్యాన్స్ లు చేశారు. మైదనమంతా కలియతిరిగారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సుధీర్ బాబు ఎంపికకాగా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా సచినోజోషి ఎంపికయ్యారు. బెస్ట్ బౌలర్ గా ఆదర్శ్, బెస్ట్ బ్యాట్స్ మెన్ గా ప్రిన్స్ ఎంపికయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *