ఎట్టకేలకు ఆంధ్రాకు కేంద్రం సాయం

ఆర్థిక లోటుతో ప్రభుత్వ బండిని నడపలేకపోతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం భారీగా సాయం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం చివరి రోజు మంగళవారం కొన్ని నిధులను విడుదల చేసింది.  విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒప్పుకున్న ప్రకారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సాయం చేస్తామని ప్రకటించారు. ఆయన ప్రకటించిన వెంటనే కేంద్రం రూ.2300 కోట్ల ను ఏపీ ఖాతాలో జమచేసింది.

అంతకు ముందు కొన్న పరిణామాలు చకచకా జరిగిపోయాయి. మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీడీపీ ప్రతినిధి కంభంపాటి కేంద్ర ఆర్థిక మంత్రి తో చర్చించి సాయం పై చర్చించారు. దీంతో సాయం కొద్దిగా అయినప్పటికీ ఇది ఏపీ ప్రభుత్వానికి గొప్ప ఊరట లభించినట్లైంది. రెవెన్యూ లోటు కింద ఏపీ కి రూ.2300 కోట్లను విడుదల చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *