
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఇవాళ తీరిక లేకుండా గడిపారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరారు. బీహార్ కంటే కష్టాల్లో ఉందని.. అందుకే బీహార్ కు ఇచ్చిన ప్యాకేజీని ఏపీకి ఇవ్వాలని కోరారు. కాగా దీనిపై మోడీ నోరు మెదపలేదని సమాచారం.. ఏపీ పునర్విభజన చట్టంలో హామీలిచ్చిన ప్రకరమే తాము సహాయం చేస్తామని.. కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మోడీ చంద్రబాబుతో సూచించారట.. కావాలంటే ఎంతో కొంత పథకాల కింద ఎక్కువగా ఇస్తామని చెప్పారట మోడీ… కాగా ఎంతో ఆశలతో ఏపీ నుంచి వెళ్లిన చంద్రబాబుకు మోడీ నిర్ణయంతో నిరాశ చెందారట..
కాగా అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఏపీ ప్రత్యేక హోదాపై కోరినా వారూ ఏమీ స్పందించలేదట.. ఏపీకి న్యాయం చేస్తామని నిథులిస్తామని కానీ ప్రత్యేక హోదా కష్టం అని చెప్పారట..
దీంతో ఎన్నో ఆశలతో వెళ్లిన చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా, టీడీపీ ఎంపీలు నిరాశలో కూరుకుపోయారు.