
*ఎంపి కవిత ప్రత్యేక చొరవతో*
*నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్లు మంజూరు*
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు రూ. 100 కోట్లు మంజూరు చేశారు. నిజామాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంపి కవిత చేస్తున్న ప్రయత్నాలకు మున్సిపల్ శాఖ నుంచి మంత్రి కెటిఆర్ నిధులను మంజూరు చేశారు.
ఆ మధ్య ఆర్మూరులో జరిగిన ప్రగతి నివేదన సభలో నిజామాబాద్ నగరం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎంపి కవిత మంత్రి కెటిఆర్‌ను ఆనాడు కోరిన విషయం తెలిసిందే. అయితే నిజామాబాద్ అభివృద్ధికి రెగ్యులర్‌గా రూ.100 కోట్లదాకా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆ నిధులతో నగరం అభివృద్ధి పనులు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రూ. 100 కోట్లు మంజూరు అయ్యాయి.
ఈ నిధులను నిజామాబాద్ నగరంలోని 50 డివిజన్లను అభివృద్ధి చేస్తారు. అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, పార్కులు ఆధునీకరణ, కొత్తగా పార్కులను తయారు చేయడం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, శానిటేషన్ వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వెచ్చిస్తారు. నగరం సుందరకీరణ పనులను కూడా ఈ నిధులతో చేపడతారు. ఇప్పటికే ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్న పనులకు ఈ నిధులను జోడించి మరింత సుందరీకరణగా నగర రోడ్లను రూపొందించనున్నారు.
ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చిన మంత్రి కెటిఆర్ కు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు.