Breaking News

ఎంత ఎదిగితే.. అంత ఒదిగి ఉండాలా..!

survey_fail_iStock_000017036325XSmall

జీవితం బర్ బాజ్ అయ్యింది సామీ.. ఉద్యోగాలు పలుచనైపోయాయి. చేస్తున్న పని బోరింగ్ అయ్యింది. చేయకపోతే ఎదుగల ఉండదు.. జీతం పెరుగుదల ఉండదు.. ప్రైవేటు ఉద్యోగాల్లో వెతలు ఇంతింత కాదయ.. సంవత్సరాల తరబడి యాజమాన్యాలు జీతాలు పెంచకపోయినా పనిచేస్తూ ఉండాల్సిందే.. ఎందుకంటే వేరే ప్రత్యామ్మాయం లేదు.. జీతం లేదంటే.. ఇక ప్రమోషన్ల మాట ఉండదు కదా..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఒక రకమైన స్థబ్దత నెలకొంది.. ఏళ్లు కొనసాగుతున్న యాజమన్యాల వైకరి వల్ల జర్నలిజం, మెడికల్ రిప్రెజెంట్, మార్కెటింగ్ రంగాల్లో ఎదుగుదల లోపించింది. రోజు ఒకటే పని.. ప్రతీ నెల అదే జీతం .. దీంతో జీవితం బర్ బాజ్ అవుతోంది. టీం లీడర్లు పనిచేయాల్సిందే.. లేకపోతే పనిచేసేవాళ్లను పెట్టుకంటూ సీనియర్లను నిర్విద్వంగా పక్కకు నెట్టేస్తున్నారు. దీంతో జూనియర్ల కింద పనిచేయాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ జీవితంలో ఇవన్నీ సర్వసాధారణం అని మిన్నకున్నా.. మనసు ఒప్పుకోదే..

మనం ఆదేశించిన నోటితో.. వారి ఆదేశాలు పాటించే కర్మ అంతకంటే దరిద్రం ఏముంటుంది చెప్పు.. అందుకే ఏ ఉద్యోగం శాశ్వతం కాదు.. ఉద్యోగరంగంలో ఎక్కువగా ఎదగక పోవడం మంచిదనిపిస్తుంది అప్పుడప్పుడు.. ఎదిగితే..కష్టాలొస్తాయి.. కన్నీళ్లొస్తాయి.. వెరసి అన్నింటిని భరించి ముందుకెళ్లడమా.. వైదొలగడమా.. చేయాలి.. లేదంటే ఉద్యోగం గోవిందా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *