Breaking News

ఎంతలో ఎంత మార్పు..!

sakshi

జీతాల పెంపుదల లేకే కొన్ని పత్రికా యాజమాన్యాలు కూనరిల్లుతున్న రోజులివి.. ఏడాదికి ఒక్కసారైన జీతాలు పెంచరా అని చకోర పక్షుల్లా ఉద్యోగులు ఎదురుచూస్తున్న పరిస్థితులున్నాయి.. ఆంధ్రప్రభ, సూర్య, వార్త పత్రికలైతే అసలు మూసివేతకు దగ్గరవుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులపై ప్రేమను కురిపించే సంస్థలున్నాయంటే అది ఖచ్చితంగా సాక్షి సంస్థయే..

sakshi2

ఇప్పటివరకు ఏ సంస్థ ఇయ్యని విధంగా కొత్త సంవత్సర కానుకగా ఉద్యోగులందరికీ వంట పాత్రలు, చాక్లెట్ డబ్బాలు, ఇతర గృహోపకరణ వస్తువులను గిఫ్ట్ లుగా ఇచ్చి ఉద్యోగుల్లో కొత్త సంవత్సర శోభను నింపింది సాక్షి యాజమాన్యం.. లాభాలు వెనకేసుకోవడం లక్ష్యంగా నడుస్తున్న నేటి పత్రికా యాజమాన్యాలు.. సాక్షిలో ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలు, జీతాలను చూసైనా మరితే అన్ని పత్రికల జర్నలిస్టులకు మేలు జరిగినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *