ఎండాకాలంలో వ్యవసాయానికి 9 గంటల కరెంట్..

power-crisis-inandhra647x450

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యం చేరడానికి దగ్గర్లో ఉన్నారు. ఈ ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రైతాంగానికి 9 గంటల విద్యుత్ అందించడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు రెడీ అవుతున్నాయి.. ఈమేరకు దాదాపు 2000 మెగావాట్లు తెలంగాణకు అందుబాటులోకి రానుంది. భూపాలపల్లి నుంచి 600 మెగావాట్లు, సింగరేణి విద్యుత్ కేంద్రం నుంచి 1200 మెగావాట్ల కరెంట్ తెలంగాణ వస్తుంది. అంతేకాదు.. మరో 570మెగావాట్లు థర్మల్ పవర్ టెక్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది.

కాగా మరో 2000మెగావాట్ల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం టెండర్ పిలిచింది. ఈ ఎండాకాలం, వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు ఇంకా వ్యవసాయం సాగు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్ 1 నుంచే రైతులకు 9 గంటల విద్యుత్ ఇచ్చేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు రెడీ అయ్యాయి..  సీఎం కేసీఆర్ కోరిక మేరకు ఖచ్చితంగా రైతులకు విద్యుత్ నందించేందుకు విద్యుత్ సంస్థలు రెడీ అయ్యాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *