Breaking News

ఊరించి.. ఊసురుమనిపించి..

kcr venkaiah

-తెలంగాణకు కేంద్ర మొండిచేయి..
-మిగులు రాష్ట్రమంటూ రిక్తహస్తం
న్యూఢిల్లీ, ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదించిన సిఫారసుల్లో తెలంగాణకు అన్యాయమే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇకనుంచి కేంద్రం పన్నుల్లో 42 శాతం వాటా ఇస్తున్న అది జనాభా ప్రాతిపదికన విభజించడంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. అత్యధికం జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు కేంద్ర పన్నుల్లో అధిక వాటా లభించనుంది. కేంద్రం మొత్తం ఆదాయంలో జనాభా నిష్పత్తి వల్ల తెలంగాణ 3 శాతంలో పే నిధులు రానున్నాయి.

అంతేకాదు దేశం మొత్తం మీద మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు నాలుగే.. అవి గుజరాత్, రాజస్తాన్, హర్యానా, తెలంగాణ. దీంతో కేంద్రం గ్రాంట్ లు మొత్తం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలకే ఎక్కువగా రానున్నాయి. దేశంలో ఏపీతో కలిపి 11 రాష్ట్రాల్లో లోటు బడ్జెట్ ఉందని కేంద్రం తెలిపింది. ఆమేరకు ఆయా రాష్ట్రాలకు లోటు భర్తీ చేస్తామని పేర్కొంది.

మిగులు బడ్జెట్ తెలంగాణకు ఏటిఏడాది పెరుగుతూ పోతుందని.. దీనివల్ల రాష్ట్రానికి రానున్న నిధులను కేంద్రం కొర్రీ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 70 వేల కోట్లు కొత్తరాష్ట్రానికి ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరింది. కానీ ఈ విన్నపాలన్నింటిని ఆర్థిక సంఘం తోసిపుచ్చింది. ఐదేళ్లలో 20వేల కోట్ల గ్రాంటులు ఇవ్వాలని కోరగా కేవలం 10వేల కోట్లతోనే సరిపెట్టింది. తెలంగాణకు ఉన్న మిగులు బడ్జెట్ ను సాకుగా చూపి ఎలాంటి అదనపు సాయాన్ని సిఫారసు చేయకపోవడంపై కేసీఆర్ మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *