Breaking News

ఊరంతా హెల్మెట్లు వాడుతున్నారు..

0012

100శాతం హెల్మెట్ల వాడకంతో చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో 427 ద్విచక్రవాహనాదారులు హెల్మెట్ల ను కొనుగోలు చేసి శనివారం నుంచి వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలోని పలు గ్రామాలకు వెదురుగట్ట గ్రామస్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

0012F

హెల్మెట్ల వినియోగంపై చొప్పదండి పోలీసులు గత నెల రోజులుగా కల్పిస్తున్న అవగామన కార్యక్రమాలతో గ్రామంలోని వాహనదారులు ప్రాణాల రక్షణను గుర్తించి హెల్మెట్ల వినియోగం తప్పనిసరని గుర్తించడంలో పోలీస్ శాఖ కృషి చేసింది..

ఈ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి నాగమారుతి శర్మ హెల్మెట్లను పంపిణీ చేసి ప్రారంభించారు. పెద్దపల్లి డీఎస్పీ మల్లారెడ్డి, సబ్ జడ్జి సుదర్శన్, జడ్పీటీసీ ఇ.సాంబయ్య, ఎంపీపీ భూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *