
సానియా-హింగిస్ జోడి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఏడు టైటిళ్లను తమఖాతాలో వేసుకున్న ఈ జోడి తాజాగా మరో టైటిల్ ను తమ ఖాతాలో వేసుకుంది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ సిరిస్లో ఈ జంట విజయం సాధించింది. ఫైనల్లో రుమేనియాకు చెందిన కేమిలా బేగు, మోనికా జోడీపై 6-2, 6-3 వరుస సెట్లతో గెలుపొందింది.