Breaking News

ఉస్మానియా వేదికగా గొడ్డుమాంసం గోల

09-1449669618-osmania-students-beef-666

– బీఫ్ ఫెస్టివెల్ వద్దంటున్న బీజేపీ, వీ.హెచ్.పీ
హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు కొందరు ఎమ్మార్పీఎస్, పీడీఎస్యూ, వివిధ విద్యార్థి సంఘాలు చేపట్టిన గొడ్డు మాసం ఫెస్టివెల్ ఉద్రిక్తతలకు దారితీస్తోంది.. ఉస్మానియా విద్యార్థులు బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తామంటూ ఈరోజు ఏర్పాటు చేశారు. దీన్ని అడ్డుకుంటామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, వీహెచ్పీ, ఏబీవీపీ విద్యార్థి సంఘం సవాల్ విసిరింది.. కేసు హైకోర్టుకు చేరి పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది..

దీంతో నేడు ఉస్మానియాలో జరుగనున్న బీఫ్ ఫెస్టివెల్ జరగకుండా పోలీసులు ఉస్మానియాను ముట్టడించారు. దాదాపు 1000 మంది పోలీసులు విద్యార్థి నాయకులను , బీఫ్ ఫెస్టివెల్ నాయకులను, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఉద్రిక్తతలకు దారితీయకుండా చర్యలు చేపట్టారు..

బీజేపీ నేతల వద్దంటున్న కొందరు ఎమ్మార్పీఎస్ విద్యార్థులు బీఫ్ ఫెస్టివెల్ నిర్వహిస్తూ లొల్లికి తెరతీశారు. విద్యార్థులు చదువుకొనే చోట ఇతర ఇలాంటి కార్యకలాపాలు వద్దంటూ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మండిపడి బీఫ్ ఫెస్టివెల్ ను నిషేధించారు.దీంతో లొల్లి లొల్లి మొదలైంది. బీజేపీ సై అనడం.. స్టూడెంట్స్ చేస్తామనడంతో ఇప్పుడు ఉస్మానియా అట్టుడుకుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *