ఉస్మానియాకి సరికొత్త వైద్య పరికరాలు డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్లు

ఉస్మానియాకి సరికొత్త వైద్య పరికరాలు
డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్లు
కొత్తగా మరో నాలుగు ఫార్మసీ కౌంటర్లు
పేషంట్ల అటెండెంట్లకు షెడ్లు
6న ప్రారంభించనున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ ః ప్రభుత్వ రంగంలో మొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉస్మానియాకి సరి కొత్త హంగులను సమకూరుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తున్నది. మరో నాలుగు అదనపు ఫార్మసీ కౌంటర్లు నిర్మించగా, అందులో పేషంట్లు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నది. మొదటి సారిగా పేషంట్ల అటెండ్లకి నీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు షెడ్లు నిర్మించింది. వీటిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు.

వందేళ్ళకు పైగా చరిత్ర ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ది. 1846లోనే ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉస్మానియా మెడికల్ స్కూల్‌గా ఏర్పడింది. దేశంలోనే పురాతన, ఉన్నతమైన ప్రమాణాలతో అప్పట్లోనే పేరుండేది. తర్వాత తార్నాకలో ఉండే హాస్పిటల్స్ని వందేళ్ళ క్రితం ప్రస్తుతం ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీకి తరలించి అనుబంధంగా ఏర్పాటు చేశారు. దేశంలో ఒక్కో స్పెషాలిటీకి ఒక్కో శిక్షణా కేంద్రం ఉన్న ఏకైక కాలేజీ. ఇలాంటి కాలేజీలో ప్రస్తుతం ఓపీ రోజుకు 2000పై చిలుకు ఉంటున్నది. ఐపి 100 నుంచి 150 మందిగా నమోదవుతున్నది. అనేక స్పెషాలిటీలు, వైద్య పరికరాలు, సదుపాయాలతో ప్రభుత్వ రంగంలో ఉన్న మొదటి, పురాతన హాస్పిటల్ ఉస్మానియా.

అత్యాధునిక డిజిటల్ ఎక్స్ రే

ఇప్పటికే ఉన్న సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలకు అదనంగా…ఉస్మానియా ఆధునీకరణ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో సరి కొత్త హంగులను ఏర్పాటు చేస్తున్నది. అత్యాధునిక వైద్య పరికరాలను అందిస్తున్నది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎక్స్ రే రూమ్‌ని పూర్తిగా ఆధునీకరించింది. అలాగే అందులో అత్యాధునిక డిజిటల్ ఎక్స్ రే యూనిట్‌ని ఏర్పాటు చేస్తున్నది. మనిషి తల నుంచి కాలి వేలి వరకు ఒకే సారి స్కాన్ చేయవచ్చు. ఎప్పుడు అవసరమైనకుంటే అప్పుడు ఎక్స్ రే ని చూసుకోవచ్చు. అలాగే, ఇతర చోట్లకు ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. ఇది అందుబాటులోకి రావడం ద్వారా రోగ నిర్ధారణలో పురోగతిని సాధించవచ్చు.

అల్ట్రా సౌండ్ రూమ్

సరి కొత్త అల్ట్రా సౌండ్ రూమ్‌ని ఏర్పాటు చేసింది టిఎస్ఎంఎస్ ఐడిసి. ఇందులోనూ అత్యాధునిక అల్ట్రా సౌండ్ మిషనరీని ఏర్పాటు చేస్తున్నది. దీని ద్వారా అల్ట్రా సౌండ్ పరీక్షలు వేగంగా చేయడమేగాక, మరింత సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించడానికి వీలవుతుంది.

మరో నాలుగు ఫార్మసీ కౌంటర్లు

ప్రస్తుతం ఉస్మానియాలో 4 కౌంటర్ల ద్వారా మందుల పంపిణీ జరుగుతున్నది. అయితే, అది ప్రస్తుతం అధికంగా వస్తున్న పేషంట్లకు సరిపడా సాధ్యపడటం లేదు. దీంతో కొత్తగా ఫార్మసీ షెడ్ వేయడం జరిగింది. అందులో మరో నాలుగు ఫార్మసీ కౌంటర్లు తెరుస్తున్నారు. అలాగే ఫార్మసీ కౌంటర్లో 60 మంది పేషంట్లు కూర్చునే విధంగా కుర్చీలు వేశారు. అదనపు కౌంటర్ల వల్ల వేచి ఉండాల్సిన అవసరం పడదు. ఒక వేళ వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చినా, పేషంట్లు రిలాక్స్ అవడానికి తాజా సదుపాయాల వల్ల వీలు కలుగుతుంది.

పేషంట్ల అటెండెంట్లకి వెయిటింగ్ షెడ్

ఇప్పటి వరకు ఉస్మానియాలో ఓపీ బ్లాక్‌లో విజిటర్లు, పేషంట్ల అటెండెంట్లకు వేచి ఉండటానికి కనీసం ఎలాంటి సదుపాయాలు లేవు. తాజాగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఒక షెడ్‌ని నిర్మించడం జరిగింది. దీంతో అనేక మంది పేషంట్లు ఈ షెడ్లో వేచి ఉండ వచ్చు. సీరియస్ కేసుల్లో ఒక్కో పేషంట్‌కు తోడుగా ఒకరికి మించి అటెండెంట్లు వస్తున్నారు. దీని వల్ల వాళ్ళు లోపల పేషంట్ల దగ్గర ఉండలేకా, బయట ఎక్కడ ఉండాలో తెలీక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన పేషంట్ల అటెండెంట్ల షెడ్ వల్ల అక్కడే వేచి ఉండవచ్చు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు టిఎస్ఎంఎస్ ఐడిసి ఎండి వేణుగోపాల్, సీఇ లక్ష్మన్ఱెడ్డి ఉస్మానియాలో డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ మిషన్లు, కొత్తగా మరో నాలుగు ఫార్మసీ కౌంటర్లు, పేషంట్ల అటెండెంట్లకు షెడ్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి లక్ష్మారెడ్డి ఈ నెల 6న ప్రారంభించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.