ఉల్లి కిలో రూ.7కే

అప్పట్టలో జనాల చేత కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ఇప్పుడు రైతులకు కంట నీరు తెప్పిస్తోంది.. రెండేళ్లలోనే కనిష్టానికి ఉల్లిధరలు పడిపోయాయి. మహారాష్ట్రలోని  నాసిక్ జిల్లా లోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన లాసల్ గావ్ లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.7 పలకడం గమనార్హం. ఇంత తక్కువ ధర ఎప్పుడు తగ్గలేదు. టోకు ఉల్లి ధర కిలోకు 4కే దొరుకుతోందట.. గుజరాత్, మహారాష్ట్ర, మధ్రప్రదేశ్ లల్లో ఉల్లి ఎగుమతులు పెరగడమే ఈ ధర పడిపోవడానికి కారణం. సరఫరా ఇంకా పెరిగితే  రూ.1 నుంచి రూ.2 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.  కాగా ప్రజలందరూ ఇప్పుడే కిలో 10లోపు ఉండడంతో ఉల్లిని కొనేందుకు ఎగబడుతున్నారు. ఒకప్పుడు క్యూలో నిలబడి ప్రభుత్వ సబ్సిడీ ఉల్లిని కొన్న పేదలు ఇప్పుడు ధర తగ్గడంతో బస్తాలు.. బస్తాలు కొంటున్నారు. ఎంతైనా భారత్ లో అన్నింటికి అతే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *