ఉమ్మడి ఆదిలాబాద్  సాగునీటి  ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ జూలై కల్లా పూర్తిచేసి ఖరీఫ్ కు సాగునీరందించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. చనాకా – కొరటా ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను  పూర్తి చేయాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టును స్పూర్తిగా తీసుకొని రికార్డు సమయంలో సదర్మాట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను కోరారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని మంత్రి శుక్రవారం నాడు సుదీర్ఘంగా సమీక్షించారు. జలసౌధలో జరిగిన సమీక్షలో ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు విద్యాసాగరరావు ,ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కె. జోషి, ఇ.ఎన్. సి మురళీధరరావు , ఆదిలాబాద్, ఎస్ఆర్ఎస్పి సిఇలు భగవంతరావు, శంకర్,ఓఎస్డి శ్రీధర్ రావు దేశ్ పాండే, పలువురు ఎస్ఇలు, ఇఇలు, వివిధ ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.   చనాకా- కొరటా ప్రాజెక్టు పనులను ఫాస్ట్ ట్రాక్ పద్దతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.  లక్ష్యాలు నిర్దేశించుకొని ఏయే పనులు ఎప్పుడు చేయాలన్న దానికి అనుగుణంగా క్యాలెండర్ రూపొందించుకోవాలని కోరారు. చనాకా – కొరటా ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌజ్ లు, ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు ఏక కాలంలో పూర్తి చేయాలన్నారు. చనాకా – కొరటా.సాత్నాల   తుమ్మిడి హెట్టి, సదర్ మాట్, కడెం కెనాల్స్, బాసర చెక్ డ్యాం తో పాటు కొమురం భీం, జగన్నాధపూర్, పిపి రావు, సాత్నాల, స్వర్ణ, చలిమెల వాగు, గడ్డన్న వాగు, మత్తడి వాగు, ర్యాలివాగు, గొల్లవాగు, నీల్వాయి వంటి మీడియం ఇరిగేషన్ పధకాల పురోగతిని మంత్రి సమీక్షించారు. గొల్లవాగు, నీల్వాయి, ర్యాలివాగు పధకాలను జూన్ చివరిలోగా పూర్తి చేసి వందశాతం ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశించారు.

మత్తడి వాగు పధకం  ఈ మార్చి చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. కొమురంభీం, జగన్నాధపూర్ పధకాలను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్రాజెక్టలు, ప్యాకేజీల వారీగా ఇరిగేషన్ మంత్రి టైమ్ లైన్ ఖరారు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణమంటే ఏళ్లకు ఏళ్ళు పడుతుందనే గత సంప్రదాయాలకు తమ ప్రభుత్వం స్వస్తి పలికిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియతో పాటు, నిర్మాణ పనులను ప్రతివారం సమీక్షించుకొని ముందుకు వెళ్ళాలని హరీశ్ రావు కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *