ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల కు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాల కు సంబంధించిన రెండు సాగునీటి ప్రాజెక్టులకు బుధవారం వన్యప్రాణి బోర్డు అనుమతి లభించడం కీలక పరిణామం. ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు గత కొన్ని మాసాలుగా మహారాష్ట్రతో జరుపుతున్న సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి.చనాకా-కోరాటా,తుమ్మిడి హట్టి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు బ్యారేజీల వల్ల వన్యప్రానులకు ఎలాంటి హానీ లేదని మహారాష్ట్ర తెలిపింది. చనాకా-కోరాటా బ్యారేజీని పెనుగంగ నదిపై నిర్మిస్తున్నారు.51 వేల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు తిప్పెశ్వర్ వన్యప్రాణి కేంద్రం నుంచి అనుమతి లభించింది. అలాగే ప్రాణహిత నదిపై 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న తుమ్మిడి హట్టి ప్రాజెక్టుకు చాప్రాల్ వన్యప్రాణి కేంద్రం అనుమతి నిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన బుధవారం ముంబై సహ్యాద్రి గెస్ట్ హౌజ్ లో ఆ రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమైంది.

ఈ సమావేశంలో మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి సుధీర్ మునిగంటివార్,వికాస్ ఖర్కే, రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ భగవాన్, తెలంగాణ కు చెందిన ఆదిలాబాద్ .ఈ.భగవంతరావు, డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ శ్రీనివాస్, పెనుగంగ ఎస్.ఈ.అంజద్ హుస్సేన్ పాల్గొన్నారు. చనాకా-కొరటా,తుమ్మిడి హట్టి బ్యారేజీల నిర్మాణం ఈ రెండు వన్యప్రాణి కేంద్రాలపై ప్రభావం ఉండదని తేల్చిన మహారాష్ట్ర వన్యప్రాణి మండలి జాతీయ వన్యప్రాణి బోర్డుకు సిఫారసు చేసింది. మహారాష్ట్ర వన్యప్రాణి బోర్డు నిర్ణయం పట్ల మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *