Breaking News

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైనా పర్యటన

images

ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఎన్టీఆర్ ఘాట్ వద్ద విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అక్కడే దాదాపు 36 ఎకరాల స్థలంలో స్మృతివనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు, స్మృతివనం అత్యద్భుతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ప్రస్తుతం విగ్రహ ఏర్పాటును అధ్యయనం చేయడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, విద్యుత్ శాఖ, ఎస్సీల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్కసుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, రసమయి బాలకిషన్, అధికారులు కలిసి చైనాలో విగ్రహాల తయారీ కేంద్రాలను, శిల్పకారులను కలిసి, రాష్ట్రంలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఏర్పాటుపై చర్చించనున్నారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద విగ్రహ ఏర్పాటు, స్మృతి వనాన్ని నిర్మించే ప్రాంతాన్ని సందర్శించారు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీలో ఈ కమిటీ సమావేశం కూడా జరిగింది. విగ్రహ తయారీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, అధికారులతో కలిసి సిక్కింలో కూడా పర్యటించి అధ్యయనం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *