ఉప్పల్ స్టేడియం కి భద్రతా ఏర్పాట్లు…

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 9 న క్రికేట్ మ్యాచ్ ఉన్న నేపధ్యంలో రాచకొండ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తుకు మొత్తం 1500 మంది పోలీసులను రంగంలోకి దింపినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.
క్రికేట్ మ్యాచ్ లు ఉన్నప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంక్షలు
అమలులో ఉంటాయని కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగే క్రికేట్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం ముస్తాబైయింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా రాచకొండ పోలీసులు ముందస్తు జాగ్రతలు తీసుకున్నారు. పోలీసు బలగాలు స్టేడియం అంతా తమ స్వాధీనంలోకి తీసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ బగవత్ తెలిపారు. ఉప్పల్ స్టేడియం పరిసరాలను గమనిస్తూ ఉండటం కోసం మొత్తం 56 సిసి కేమెరాలతో భద్రతా పర్యవేక్షణకు రంగం సిద్ధం చేశామని కమీషనర్ ఈ పందర్బంగా తెలియజేశారు. తనిఖీలు నిర్వహించే సిబ్బంది ఎప్పటి కప్పుడు ఇతర అధికారులతో సంభాషించగలిగే విధంగా ఏర్పాట్లు జరిగాయన్నారు. స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు తొక్కిసలాట జరగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అసాంఘిక శక్తులు స్టేడియం లోనికి చొరబడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నామన్నారు. క్రికేట్ మ్యాచ్ ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియం పరిసరా ప్రాంతాలలో ట్రాఫిక్ అంక్షలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు. స్టేడియంలోనికి బ్యాగ్గులు, సెల్ పోన్ లు, ల్యాప్‌ టాప్‌ లు, వాటర్ బాటిల్స్ లాంటివి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద డోర్ మెటల్ డిటెక్టర్లు, సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.