Breaking News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌్లో రెండు నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు రెండు నామినేష‌న్లు తిర‌స్క‌ర‌ణ ఒక‌టి పెండింగ్‌


 హైద‌రాబాద్ రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శాస‌న మండ‌లి ఉపాధ్యాయ స్థానానికి నేడు జ‌రిగిన నామినేష‌న్ల ప‌రిశీల‌న‌లో ఇద్ద‌రి నామినేష‌న్లు తిర‌స్క‌రించారు.  మొత్తం 17మంది 33 నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌గా నేడు రిట‌ర్నింగ్ అధికారి అద్వైత‌కుమార్ సింగ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ప‌రిశీల‌న‌లో నిబంధ‌న‌ల ప్ర‌కారం లేనందున‌ కోయ‌ల్‌కార్ బోజ‌రాజు, సంతోషియాద‌వ్‌ నామినేష‌న్ల‌ను తిర‌స్క‌రించ‌డం జ‌రిగింది. మ‌రో అభ్య‌ర్థి డా.వి.న‌తానియెల్ నామినేష‌న్‌ను రేప‌టి వ‌ర‌కు పెండింగ్‌లో ఉంచి త‌గు వివ‌రణ స‌మ‌ర్పించ‌డానికి గ‌డువును ఇచ్చారు.  నామినేష‌న్ల ప‌రిశీల‌న అనంత‌రం  ఇ.ల‌క్ష్మ‌య్య, న‌ర్ర భూప‌తిరెడ్డి, మ‌హ్మ‌ద్ మోయినుద్దీన్ అహ్మ‌ద్‌, ఎస్‌.విజ‌య్‌కుమార్‌, ఏ.వెంక‌ట‌నారాయ‌ణ‌రెడ్డి, పాప‌న్నగారి మాణిక్‌రెడ్డి, కాటేప‌ల్లి జ‌నార్థ‌న్‌రెడ్డి, జీ.హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రెడ్డి, ఏ.ల‌క్ష్మ‌య్య‌, ఎం.వి.న‌ర్సింగ్‌రావు, మీసాల  గోపాల్ సాయిబాబా, అర‌క‌ల కృష్ణ‌గౌడ్‌,  జ్ఞానేశ్వ‌ర‌మ్మ‌, ఎం. మ‌మ‌త‌లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ ఉంటుంద‌ని, మార్చి 9వ తేదీ ఉద‌యం 8గంట‌ల నుండి సాయంత్రం 6గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని రిట‌ర్నింగ్ అధికారి అద్వైత కుమార్ సింగ్ తెలిపారు.
WhatsApp Image 2017-02-21 at 12.31.13 PMWhatsApp Image 12017-02-21 at 12.31.15 PM

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *