
తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన షెడ్యుల్ విడుదలైంది. ఈ మేరకు ఇవాళ జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బదిలీ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ను ఆన్ లైన్ లో పెడుతున్నామని తెలిపారు. కనీసం 2 ఏళ్లు సర్వీసులో ఉన్నవారు బదిలీకి అర్హులని తెలిపారు.8 ఏళ్లు ఒకేచోట పనిచేస్తే బదిలీ చేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్లు దాటితే బదిలీ చేస్తామన్నారు.