ఉపాధ్యాయుడి చైనా టూర్ కు ఏర్పాట్లు చేసిన కేటీఆర్

న్యూఢిల్లీ : అంతర్జాతీయ స్కూల్ గేమ్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే భారత జట్టు ఇన్ చార్జీగా రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి డా. కే. రాంరెడ్డి నియమితులయ్యారు. ఆయన చైనా వెళ్లడానికి రాష్ట్ర విద్యాశాఖకు సమాచార లోపంతో అనుమతి నిరాకరించింది. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీలోని కేటీఆర్ ఢిల్లీ నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. దీంతో అధకారులు రాంరెడ్డి చైనా పర్యటనకు వీలుగా అనుమతులు ఇచ్చి ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ చొరవపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *