ఉపాధి హమీ కూలీలు బిల్లులన్ని బ్యాంకుల ద్వారా చెల్లించాలి

కరీంనగర్: ఉపాధి హమీ పధకంలో పని చేస్తున్న కూలీల బిల్లులన్ని ఆన్ లైన్ పద్దతిలో బ్యాంకుల ద్వారా చెల్లించుటకు వంద శాతం కూలీలకు బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులు ఎం.పి.డి..ఓ.లు డ్వామా అధికారులతో బిల్లుల చెల్లింపు పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హమీ కూలీలందరికి (జీరో) ‘0’బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు తెరవాలని బ్యాంకు అధికారులను సూచించారు. అందుకు సంబంధించి ఉపాధి కూలీల ఆధార్ కార్డులు, ఫోటోలతో బ్యాంక్ ఖాతా తెరుచుటకు ధరఖాస్తులు పూరించి సంబంధిత సర్వీస్ ఏరియా బ్యాంకులలో బల్క్ గా అందజేయాలని ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. మార్చి, 31 వరకు వంద శాతం బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని అన్నారు. మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వద్ద నుండి ఆధార్ కార్డుతో సహ అన్ని వివరాలు సేకరించి బ్యాంకులలో సమర్పించాలని ఆదేశించారు. ఉపాధి కూలీల ఆధార్ నెంబర్లు, ఇతర వివరాలు యుద్ద ప్రాతిపదికన సేకరించాలని ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. అలాగే ఉపాధి బిల్లుల చెల్లింపులతో పాటు ప్రభుత్వం ద్వారా నెల నెల చెల్లించు పింఛన్లను కూడా ఆన్ లైన్ లో బ్యాంకుల ద్వారా చెల్లించుటకు ఖాతాలు ప్రారంభించాలని కలెక్టర్ ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. జిల్లాలో కొత్తగా కొన్ని బ్యాంక్ బ్రాంచీలు, మండలాలలో ప్రారంభించారని అన్ని బ్యాంకులు ప్రజలకు దగ్గరలో అందుబాటులో ఉన్న బ్యాంకులకు సర్వీస్ ఏరియా బ్యాంకులుగా గుర్తించుటకు ప్రతిపాదనలు సమర్పించాలని ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. ఎం.పి.డి.ఓ.ల నుండి ప్రతిపాదనలు అందిన తరువాత అన్ని మండలాలలోని ప్రభుత్వ జాతీయ బ్యాంకులకు సర్వీసు ఏరియా గ్రామాలను ఎంపిక చేసి ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల
ఖాతాలన్ని ప్రభుత్వ జాతీయ బ్యాంక్ లలోనే ఉండాలని, ప్త్ర్రెవేటు బ్యాంకులలో ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు ‘0’బ్యాలెన్స్ ఖాతాలు తెరుచుటకు బ్రాంచ్ ఆఫీసులకు జారీ చేయాలని సూచించారు.

సంక్షేమ పధకాల లబ్దిదారుల ఎంపిక వివరాలను వెంటనే పంపాలి: జిల్లలో ఎస్పీ, బిసి, ఎస్టీ, మైనార్టీ కార్పోరేషన్ల ద్వారా మండలాలలో సంక్షేమ పధకాలకు ఎంపికైన లబ్దిదారుల వివరాలు బ్యాంక్ కాన్సెంట్ తో సహ వెంటనే పంపించాలని జిల్లా కలెక్టర్ ఎం.పి.డి.ఓ.లను ఆదేశించారు. జిల్లాకు మంజూరైన సంక్షేమ యూనిట్లన్ని ఎట్టి పరిస్ధితిలో మార్చి లోగా వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. సంక్షేమ యూనిట్లకు ఎంపికైన లబ్దిదారులకు ట్విన్ బ్యాంక్ ఖాతాలు తెరిపించి పంపించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతా వివరాలు పంపిన లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వ సబ్సిడినీ జమ చేయాలని ఆదేశించారు. సంక్షేమ యూనిట్లను మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించి గ్రౌండింగ్ చేయించాలని ఆదేశించారు.

DSC_8892

చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో శిక్షణ: జిల్లాలో ఎస్సీ, బి.సి, ఎస్టీ, మైనార్టీ లలో చదువుకున్న యువతి యువకులకు వివిధ వృత్తులలో శిక్షణ ఇప్పించి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని అందుకు గ్రామాలలోని యువతను మార్చి 3న కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగు అవగాహన సదస్సుకు పంపించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో న్యాక్ ద్వారా 700 మందికి శిక్షణ ఇస్తున్నామని అందులో ఇంతవరకు 500 మందికి శిక్షణ పూర్తయిందని వారిలో 400 మందికి వివిధ ప్త్ర్రెవేట్ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో వివిధ గ్రామాలలో పేద కుటుంబాలకు చెందిన, ఉపాధిహమీల పధకంలో పనిచేస్తున్న కూలీలలో చదువుకున్న నిరుద్యోగ యువతి, యువకులకు శిక్షణ ఇప్పించుటకు అవగాహన సదస్సుకు పంపించాలని ఎం.పి.డి.ఓ.లను సూచించారు. యువతకు ఎలక్ట్ర్రికల్ మోటర్ వైండింగ్, పంపుసెట్ల నిర్వహణ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కలర్ టివి రిపేరింగ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషన్ రిపేరు, అగరబత్తుల తయారీ, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్ల తయారీ, లేడీస్ టైలరింగ్, బ్యూటీ పార్లర్, సెల్ ఫోన్ రిపేరింగ్, ల్యాండ్ సర్వే ట్త్ర్రెనింగ్, ఎలక్ట్ర్రికల్ వైరింగ్, వెల్డింగ్, గార్మెంట్ మేకింగ్, బేకరి ఉత్పత్తుల తయారీ, కంప్యూటర్స్ బేసిక్స్, డ్త్ర్రెవింగ్, క్యాండిల్ మేకింగ్, పి.ఓ.పి. ట్త్ర్రెనింగ్ మొదలగు వృత్తులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో మార్చి చివరి వారంలో మెగా జాబ్ మేళాలను నిర్వహించి చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *