ఉపాధి హమి పెండింగ్ బిల్లులు 10 రోజుల్లో చెల్లించాలి

కరీంనగర్: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హమి పధకం కింద జరిగిన పనులకు పెండింగ్ బిల్లులు 10 రోజుల్లో కూలీలకు పంపిణి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఉపాధి హమి ఎ.పి.ఒ.లలో ఉపాధి హమి పధకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హమి కూలీలకు బిల్లులు అన్ని బ్యాంకుల ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేయాలని సూచించారు. ఇంకా కొంత మంది బ్యాంకు ఖాతాలు లేని వారిని 10 రోజుల్లో ఖాతాలు ప్రారంబించాలని ఆదేశించారు. ఫిబ్రవరి, మార్చిలలో జరిగే పనులకు కూలీలకు పెండింగ్ లో ఉన్న బిల్లులను స్మాట్ కార్డు మిషన్ ల ద్వారా వేలి ముద్రలు సరిచూసుకుని పేమెంట్ చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్దితిలో మాన్యువల్ పేమెంటు చేయరాదని అన్నారు. వేలి ముద్రలు సరిపోని వారిని, మరియొకసారి వేలిముద్రలు సేకరించాలని అన్నారు. పెండింగ్ బకాయిలు స్పెషల్ డ్త్ర్రెవ్ నిర్వహించి చేయాలని అన్నారు. ఎం.పి.డి.ఒ.ల సమక్షంలో గ్రామంలో ఒకసారి వన్ టైం సెటిల్ మెంటు పద్దతిలో బిల్లు చెల్లించాలని ఆదేశించారు. ఉపాది బిల్లుల చెల్లింపు పై వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని పిడిని ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హమి పనులలో కూలీల సంఖ్యను పెంచాలని ఎం.పి.డి.ఒ.లను ఆదేశించారు. జిల్లాలో ఈ రోజు 55 వేల మంది జిల్లాలో ఉపాధి పనులు చేస్తున్నారని వారి సంఖ్యను పెంచాలని అన్నారు. ఉపాధి హమి కింద హరిత హరంలో మొక్కలు నాటుటకు గుంతలు తవ్వించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సిటి నిర్వహణ సంస్ధ పి.డి. గణేష్, అడిషనల్ పి.డి. అంజయ్య, డిప్యూటి సి.ఇ.ఒ. గౌతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *