ఉపాధి ప‌నులు, సీసీ రోడ్ల నిర్మాణంపై పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వీడియో కాన్ఫ‌రెన్స్‌

ఉపాధి ప‌నులు, సీసీ రోడ్ల నిర్మాణంపై పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వీడియో కాన్ఫ‌రెన్స్‌

డీఆర్డీఓల ప‌నితీరుకు ఉపాధి ప‌నులే ప్రాతిప‌దిక‌

సీసీ రోడ్ల ప్ర‌తిపాద‌న‌లు వెంట‌నే పంపాలి

గ‌త ఏడాది మిగిలిపోయిన‌ ప‌నుల‌ను పూర్తి చేయాలి

అనుమ‌తించిన ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించాలి

మిష‌న్ భ‌గీర‌థ పైప్‌లైన్ల వ‌ల్ల రోడ్ల‌కు ఇబ్బందులు రాకుండా చూసుకోండి

ఉపాధి కూలీల పెండింగ్‌, రిజెక్టెడ్ ఖాతాల‌ను వెంట‌నే స‌రిచేయాలి

బ్యాంకు ఖాతాల‌కు ఆధార్ సీడింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలి

వ‌న‌ప‌ర్తి జిల్లా క‌లెక్ట‌రేట్ నుండి 30 జిల్లాల డీఆర్డీఓలు, ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో స‌మీక్ష‌

హైద‌రాబాద్ స‌చివాల‌యం నుండి హాజ‌రైన క‌మిష‌న‌ర్ నీతూ ప్రసాద్, ఈ ఎన్ సీ స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, సీఈ తిరుప‌తి రెడ్డి హైద‌రాబాద్‌-సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్ర‌తిపాద‌న‌లు వెంట‌నే పంపాల‌ని…అనుమ‌తించిన ప‌నులు త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌ని పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. ఉపాధి ప‌నులు, సీసీ రోడ్ల నిర్మాణంపై వ‌న‌ప‌ర్తి జిల్లా క‌లెక్ట‌రేట్ నుండి మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. హైద‌రాబాద్ స‌చివాల‌యం నుండి క‌మిష‌న‌ర్ నీతూ ప్రసాద్, ఈ ఎన్ సీ స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, సీఈ తిరుప‌తి రెడ్డి త‌దిత‌రులు హాజ‌రుకాగా, 30 జిల్లాల‌కు చెందిన డీఆర్డీఓలు, ఇంజ‌నీరింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్ప‌టికే 257 కోట్ల 78 ల‌క్ష‌ల విలువైన 6 వేల 834 సీసీ రోడ్ల ప‌నుల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింద‌ని…ఆ ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. ఇంకా 12 జిల్లాల‌కు చెందిన ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌ని… వాటిని రెండు, మూడురోజుల్లో అంద‌జేస్తే అనుమ‌తులు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ‌త సంవ‌త్స‌రం పూర్తి చేయ‌ని దాదాపు 199 కోట్ల విలువైన 5 వేల ప‌నుల‌ను కూడా ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌ని..గ్రామాల్లో అంత‌ర్గ‌త పైప్‌లైన్లు వేస్తే రోడ్డుకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల‌ని సూచించారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌నులు పూర్తి చేసిన వెంట‌నే ఎఫ్ టీ ఓ (ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్డ‌ర్‌)ల‌ను ఆప్‌లోడ్ చేయాల‌న్నారు. ఉపాధి కూలీల వేత‌నాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లిస్తున్న‌ప్ప‌టికీ… స‌స్పెండ్, రిజెక్టెడ్ ఖాతాల వ‌ల్ల కొంద‌రికి వేత‌నాలు చెల్లింపు జ‌ర‌గ‌డం లేద‌న్నారు. దీనిని త్వ‌ర‌తగ‌తిన ప‌రిష్క‌రించి, నెలాఖ‌రులోగా అంద‌రికీ వేతనాలు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఆయా ఖాతాల‌ను స‌రిచేయ‌డంతో పాటు…ఆధార్ సీడింగ్ ను కూడా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గ‌త సంవ‌త్స‌రం ఇదే స‌మ‌యంతో పోలిస్తే ప్ర‌స్తుతం ఉపాధి ప‌నులు కొంత మండ‌కొడిగా సాగుతున్నాయ‌ని..వేగం పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం తొలి మూడునెలల్లో పెద్ద ఎత్తున ఉపాధి ప‌నులు జరిగాయ‌ని…ఆ త‌ర్వాత ఎందుకు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని అధికారుల‌ను మంత్రి ప్ర‌శ్నించారు. గ్రామాల్లోని కూలీల‌ను ప‌నుల్లో పాల్గొనేలా ఫీల్డ్ అసిసెంట్ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. మార్చి నెలాఖ‌రులోగా ఉపాధి ప‌నుల్లో నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తి చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ఉపాధి ప‌నుల్లో చూపిన పురోగ‌తే ప్రాతిప‌దికగానే డీఆర్డీఓల ప‌నితీరును అంచ‌నా వేయ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఉపాధి ప‌నుల‌ను కూడా ప‌రిశీలించి…ఏ ప‌నుల్లో వెనుక‌బ‌డ్డామో గుర్తించాల‌ని సూచించారు. 100 శాతం వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణం జ‌రిగిన గ్రామాల్లో సోషల్ ఆడిటింగ్ కోసం జిల్లాల వారీగా బృందాల‌ను ఏర్పాటు చేస్తే వేగంగా పూర్తి చేయ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్నట్లు క‌మిష‌నర్ నీతూ ప్ర‌సాద్ తెలిపారు. ఆ దిశ‌గా జిల్లాల్లో బృందాల‌ను ఏర్పాటు చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు.

drdo

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *