ఉపాధి కోసం కాదు ఉద్యోగాలిచ్చే స్థాయికెదగాలి దళిత యువతకు మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధ 

 

ఉపాధి కోసం కాకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికెదిగేందుకు వృత్తి విద్యలు దోహదపడాలని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దళిత్ యువతకు ఉద్బోధించారు. పూర్వకాలంలో వృత్తి విద్య కోర్సులు వారసత్వంగా సంక్రమించేవని ఆయన పేర్కొన్నారు. బుధవారం రాత్రి రాష్ట్ర యస్.సి కార్పొరేషన్ ఆద్వర్యంలో జాతీయ పర్యాటక ఆథిద్య సంస్థ (NITHM) లో దళిత యువతకు ఉపాధి రంగంలో శిక్షణ కోర్సులను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. జాతీయ పర్యాటక ఆథిద్య సంస్థ (NITHM) డైరెక్టర్ శేరి చిన్నం రెడ్డి అద్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డిమాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వఉద్యోగాలను నియమించకుండా గత ప్రభుత్వాలు తాత్సారం చేయడం వల్ల లక్షలాది మంది పట్టభద్రులు పట్టాలు చేతులో పట్టుకొని నిలబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులలో నేడు తెలంగాణ ప్రభుత్వం లక్ష మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలివ్వగలిగిందన్నారు. అవకాశం వస్తే ఆకాశమే సరిహద్దుగా యువత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఉపాధి రంగంలో సరిహద్దులు అనేవి ఉండవని ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ఎదిగిన వరండాలు కింది నుండి వచ్చినవేరే నాన్ విషయం యువత గుర్తించాలని ఆయన ఉపదేశించారు. టాటా,బిర్లా నుండి బిల్ గేట్స్ దాక వారు సృష్ట్టించుకున్న సంపదేనే నన్నారు. ఆకాశంలో పోయే విమానాలను చూడడం కాదు నేటి తరానికి కావాల్సింది వాటిని తయారు చేయగల ఎత్తుకు యువత
ఎదగాలన్నదే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం అని ఆయన చెప్పారు.

jagadish reddy 1

అందులో భాగంగానే యావత్ భారత్ దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం దళిత యువతకోసం ఎయిర్ హోస్టెస్ స్టివార్డ్ రంగంలో శిక్షణను ప్రారంభించిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు యస్.సి కార్పొరేషన్ జాతీయ పర్యాటక ఆథిద్య సంస్థ (NITHM) డైరెక్టర్ శేరి చిన్నం రెడ్డి తో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఒక్కో విద్యార్థి ఫై 1,52,000 మొత్తం 40 మంది విద్యార్థులకు గాను 60,80,000 ఖర్చు చేయనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.అంతే గాకుండా ఇప్పటి వరకు మొత్తం కోటి  40 లక్షల 44 వేల 200 వ్యయంతో జాతీయ పర్యాటక ఆథిద్య సంస్థ (NITHM) వివిధ రంగాల వృత్తులలో శిక్షణకోర్సులను ప్రారంభించిందన్నారు. ఇప్పటికే న్యాక్,అప్పోల మెడికల్స్కిల్స్,కెల్ట్రాన్,మహిళా ప్రాంగణం వంటి సంస్థలతో రాష్ట్ర  యస్.సి కార్పొరేషన్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 235,45 లక్షలతో వృత్తి శిక్షణ కోర్సులలో 771 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలోజాతీయ  పర్యాటక ఆథిద్య సంస్థ (NITHM) డైరెక్టర్ శేరి చిన్నం రెడ్డి,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖా కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రసాద్,యస్.సి కార్పొరేషన్ యం.డి బుచ్చిరం నాయక్,జెనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

jagadish reddy 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *