Breaking News

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు

 

మూడు రోజుపర్యటన ముగించుకుని హైదరాబాదు నుండి బయలుదేరిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం ఉదయం వీడ్కోలు పలికారు. శనివారo నగరానికి విచ్చేసి, వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఉపరాష్ట్రపతి మంగళవారం ఉదయం కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ తో పాటు, రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ శ్రీ కే. స్వామి గౌడ్, జి.ఎ.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అధర్ సిన్హా,  రాజ్ భవన్ ముఖ్యకార్యదర్శి శ్రీ హర్ ప్రీత్ సింగ్, శ్రీ రవి గుప్తా, అదనపు డి.జి.పి., అదనపు కమీషనర్ ఆఫ్ పోలీసు శ్రీ మురళీకృష్ణ, హైదరాబాదు జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగితా రాణా, జి.ఎ.డి. ప్రోటోకాల్ డిప్యూటీ సెక్రటరీ శ్రీ అరవిందర్ సింగ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.    

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *