
రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాదు నుండి బయలుదేరిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం ఉదయం వీడ్కోలు పలికారు. ఆదివారం నగరానికి విచ్చేసి, వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఉపరాష్ట్రపతి సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కమిషనర్ ఆఫ్ పోలీసు (ట్రాఫిక్) శ్రీ అనిల్ కుమార్, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ శ్రీ అరవిందర్ సింగ్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీవత్స, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.