
వివిధ కార్యక్రమాలలో పాల్గొనుటకు రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాదుకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం హైదరాబాదుకు చేరుకున్నారు. ఆయన ఇదే రోజున తార్నాక లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR-IICT) ప్లాటినం జూబిలీ సెలెబ్రేషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమo లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర అదనపు కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ అనిల్ కుమార్, హైదరాబాదు జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగితా రాణా, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ శ్రీ అరవిందర్ సింగ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు ఉన్నారు.