
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో శుక్రవారం హైదరాబాదుకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ , తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ శ్రీ కె.స్వామిగౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్, డి.జి.పి. శ్రీ ఎం. మహేందర్ రెడ్డి, ప్రోటోకాల్ డిప్యూటీ సెక్రటరీ శ్రీ అరవిందర్ సింగ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.