ఉన్నవి బాగు చేయి సామి..!

trs-president-k-chandrashekar-rao-with-bjp-161306

ప్రజలు పాలించడానికి 5 ఏళ్ల సమయమే ఇస్తారు.. ఆ తర్వాత నచ్చకపోతే గద్దెదించుతారు. ఇది తెలుసుకొని రాజకీయ పార్టీలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి.

సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.  కొత్తగా సచివాలయం నిర్మించేందుకు కేంద్రం ఆధీనంలో ఉన్న జింఖానా, పోలో మైదానాలను ఇవ్వమని కేంద్ర మంత్రులను అడిగారు. వాటిల్లో కొత్త సచివాలయాలను నిర్మించాలన్నది కేసీఆర్ ప్లాన్..

ఓ వైపు ఆర్టీసీ కార్మికులు జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్నారు. 108 ఉద్యోగులు సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వచ్చి తమ బతుకులు మారుతాయని.. ఉద్యోగాలు వస్తున్నాయని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని సమస్యలుండగా సీఎం కేసీఆర్ అదేం పట్టనట్టు ఢిల్లీ వెళ్లి కోర్కెలు కోరుతున్నారు.

సచివాలయం నిర్మించడం వల్ల అధికారులు, సీఎం కు సౌకర్యవంతం గానీ ప్రజలకు పెద్దగా ఒరిగేదేం ఉండదు. అవే అర్జీలు.. అవే అధికారులు..  గద్దెనెక్కించిన ప్రజల అవసరాలు తీర్చిననాడే ప్రభుత్వాలు ఐదేళ్లు కాదు.. 20 ఏళ్లయిన అధికారంలో ఉంటాయి. ఇలా ప్రజల సొమ్ముతో దుబారా చేసి కాలయాపన చేసే నేతలు ఉన్నంత కాలం ప్రజల సమస్యల తీరవు.. మరో నాలుగేళ్లలో అద్భుతాలు చేసుడు కాదు.. ప్రజల సమస్యలు తీర్చండి ముందు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *