ఉద్య‌మంలా ఉపాధి హామీని ముందుకు తీసుకెళుతాం : మీడియాతో రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ చైర్మ‌న్, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన రాజేంద్ర నగర్ లోని సిపార్డ్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ రెండ‌వ మీటింగ్

హాజరైన మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నర్సింహారెడ్డి

అంద‌రి భాగ‌స్వామ్యంతో ఉద్య‌మంలా ఉపాధి హామీ

ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు సాగుతున్నాయి

మూడు నెలల్లోనే 1106 కోట్ల రూపాయల వేత‌న వ్య‌యంతో ప‌నులు చేపట్టి, దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణా నిలిచింది

2016-17లో తొలిసారిగా 100 శాతం కేంద్ర ఉపాధి నిధులను వినియోగించుకోగలిగాం

ఈ ఏడాది కనీసం 3 వేల కోట్ల విలువైన పనులను చేప‌ట్టాల‌నే లక్ష్యంతో ముందుకు పోతున్నాం

ఈ ఏడాది కనీసం 60% మంది కూలీల‌కు 100 రోజుల పని క‌ల్పించే ల‌క్ష్యంతో ముందుకు పోతున్నాం

సెర్ప్ ఉద్యోగులందరిని భగస్వామ్యం చేస్తూ ఆదేశాలు ఇచ్చాం

మిషన్ కాకతీయ చెరువుల పూడిక తీతను పెద్ద ఎత్తున చేపడుతున్నాం

వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నాం, స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.200 కోట్ల అడ్వాన్స్‌

2018 అక్టోబ‌ర్ 2 నాటికి స్వ‌చ్ఛ తెలంగాణా 

గ‌త హ‌రిత‌హారంలో 401 కోట్లు 9.3 కోట్ల మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నాటాం

ప్రతి గ్రామం లో నర్సరీలను SHG గ్రుపుల ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు

పారదర్శికతకు పెద్ద పీట వేస్తూ 8121 పంచాయతిలో సోషల్ ఆడిట్ నిర్వ‌హించాం

ప్రతి 1000 జనాభాకు ఇద్దరు పారిశుద్య కార్మికులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం

ఉపాధి కౌన్సిల్ సభ్యులకు వాహన భత్యం తో పాటు, ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిశీల‌న‌కు పంపుతాం

మండ‌ల‌, జిల్లా స్థాయి లో జ‌రిగే స‌మావేశాల‌కు ఉపాధి హామీ కౌన్సిల్ స‌భ్యుల‌ను ఆహ్వానించేలా ఆదేశాలిస్తాం

ఈ ఆర్థిక సంవత్సరం లో 2.63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం…

ఇందులో ఇప్పటికే 26.95 కోట్ల తో 34088 మరుగుదొడ్లను నిర్మించాం

పాఠ‌శాల‌ల్లో టాయిలెట్స్‌, కిచెన్ షెడ్స్ నిర్మాణాలు చేపడుతున్నాం

మండ‌ల కేంద్రాలు, మేజ‌ర్ పంచాయ‌తీల్లో ప‌బ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

రూ.13 లక్షల తో పంచాయ‌తీ భ‌వ‌నాలు, 10 లక్షలతో శ్మశానవాటికలు నిర్మిస్తున్నాం

ఇంకుడు గుంత‌లు, ఫామ్ పాండ్స్ ను ఎక్కువగా నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌

మీడియాతో రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ చైర్మ‌న్, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

అంద‌రి భాగ‌స్వామ్యంతో ఉపాధి హామీని ఉద్య‌మంలా ముందుకు తీసుకుపోవాల‌ని తెలంగాణా ఉపాధి హామీ కౌన్సిల్ చైర్మ‌న్, పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. రాజేంద్ర నగర్ లోని సిపార్డ్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ రెండ‌వ స‌మావేశం శ‌నివారం జ‌రిగింది. కౌన్సిల్ చైర్మ‌న్, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో స‌భ్యులైన మంత్రులు మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ఉపాధి హామీ ప్ర‌గ‌తిని గ్రామీణాభివృద్ధి శాఖ క‌మిష‌న‌ర్ నీతూప్ర‌సాద్ వివ‌రించారు. ఇటీవ‌ల జాతీయ స్థాయిలో అవార్డులు ద‌క్కించుకున్న ఉపాధి హామీ సిబ్బందిని, అధికారుల‌ను మంత్రి హ‌రీష్ రావు అభినందించారు. క్షేత్ర‌స్థాయిలో ఎదుర‌వుతున్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను మంత్రులు హ‌రీష్‌రావు, పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డిలతో పాటు ఇత‌ర స‌భ్యులు కౌన్సిల్ స‌మావేశంలో ప్ర‌స్తావించారు. త‌మ‌కు జిల్లా, మండ‌ల స్థాయి స‌మావేశాల్లో పాల్గొనే అవ‌కాశం క‌ల్పించాల‌ని, టీఏ ఇవ్వాల‌ని ప‌లువులు స‌భ్యులు కోర‌గా చైర్మ‌న్ జూప‌ల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.  వాట‌ర్ స్టోరేజీ పాండ్‌కు ప్లాస్టిక్ క‌వ‌ర్ బ‌దులుగా బ్రిక్స్‌తో నిర్మించుకునే అవ‌కాశం ఇవ్వాల‌ని మంత్రి హ‌రీష్ కోరారు. అలాగే మొక్క‌ల‌కు నీటిని పోసేందుకు వినియోగిస్తున్న ట్యాంక‌ర్‌కు 482 రూపాయ‌లే ఇస్తున్నార‌ని…దీనిని పెంచాల‌ని ఆయ‌న కోరారు. శ్మ‌శాన వాటిక‌ల కోసం సిద్దిపేట‌లో ప్ర‌త్యేకంగా ఒక డిజైన్‌ను రూపొందించామ‌ని…దీనిని ఇత‌ర ప్రాంతాల్లోనూ టైప్ 2గా నిర్మించుకునే వెసులు బాటు ఇవ్వాల‌ని సూచించారు. రోడ్ ప‌క్క‌న కూర‌గాయ‌లు అమ్ముకునే వారికోసం షెడ్డుల నిర్మాణాన్ని ప‌రిశీలించాల‌ని సూచించారు. కూలీల‌కు ప‌నిముట్లు అంద‌జేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. స‌మావేశంలో సోష‌ల్ వెల్ఫేర్ శాఖ స్పెష‌ల్ సీయ‌స్ అజ‌య్ మిశ్రా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, కౌన్సిల్‌ స‌భ్యులైన క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ జెడ్పీ చైర్మ‌న్లు తుల ఉమ‌, ప‌ద్మ‌, ఇత‌ర స‌భ్యులు, అధికారులు పాల్గొన్నారు.

అంద‌రి భాగ‌స్వామ్యంతో ఉద్య‌మంలా ఉపాధి హామీ….

అనంత‌రం కౌన్సిల్ స‌మావేశం వివ‌రాల‌ను చైర్మ‌న్, పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్‌రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌లు మీడియాకు వివ‌రించారు. అంద‌రి భాగ‌స్వామ్యంతో ఉద్య‌మంలా ఉపాధి హామీని ముందుకు తీసుకుపోవాల‌ని కౌన్సిల్ స‌మావేశంలో నిర్ణ‌యించామ‌న్నారు. ప్ర‌స్తుత‌ ఆర్థిక సంవ‌త్స‌రంలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు జ‌రుగున్నాయ‌ని…కేవ‌లం మూడు 1106 కోట్ల రూపాయల వేత‌న వ్య‌యంతో ప‌నులు చేపట్టి, దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణా నిలిచిందని మంత్రి జూప‌ల్లి తెలిపారు. 2016-17లో తొలిసారిగా 100 శాతం కేంద్ర ఉపాధి నిధులను వినియోగించుకోగలిగామ‌ని…జాతీయ స్థాయిలో ఐదు అవార్డుల‌ను కూడా ద‌క్కించుకున్నామ‌న్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 3 వేల కోట్ల విలువైన పనులను చేప‌ట్టాల‌ని టార్గెట్ పెట్టుకున్నామ‌ని… అలాగే జాబ్ కార్డులు క‌లిగి ఉన్న వారిలో క‌నీసం 60 శాతం మంది కూలీల‌కు 100 రోజుల పని క‌ల్పించే ల‌క్ష్యంతో ముందుకు పోతున్నామ‌న్నారు. సెర్ప్ ఉద్యోగులందరిని భాగస్వామ్యం చేస్తూ ఆదేశాలు ఇచ్చామ‌ని…గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఉపాధి ప‌నుల‌పై ప్ర‌చారం చేస్తున్నామ‌న్నారు. మిషన్ కాకతీయ చెరువుల పూడిక తీతను పెద్ద ఎత్తున చేపడుతున్నామ‌ని…అలాగే పాఠ‌శాల‌ల్లో టాయిలెట్స్‌, కిచెన్ షెడ్స్ నిర్మాణాలు చేపడుతున్నామ‌న్నారు. రూ.13 లక్షల తో పంచాయ‌తీ భ‌వ‌నాలు, 10 లక్షలతో శ్మశానవాటికలు నిర్మిస్తున్నామ‌న్నారు. 2018 అక్టోబ‌ర్ 2 నాటికి స్వ‌చ్ఛ తెలంగాణాగా మార్చ‌డంలో భాగంగా… ఇంకుడు గుంత‌లతో పాటు, పెద్ద ఎత్తున వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణాలు చేప‌డుతున్నామ‌న్నారు. మేజ‌ర్ పంచాయ‌తీలు, మండ‌ల కేంద్రాల్లో ప‌బ్లిక్ టాయిలెట్స్ నిర్మించేందుకు కూడా ఆలోచ‌న చేస్తున్నామ‌న్నారు. ఈ ఆర్థిక సంవత్సరం లో 2.63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని..ఇందులో ఇప్ప‌టికే 26.95 కోట్ల వ్యయంలో 34 వేల 88 మరుగుదొడ్లను నిర్మించామ‌ని తెలిపారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.200 కోట్లను మ‌హిళా సంఘాల‌కు అడ్వాన్స్ రూపంలో అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు.  గ‌త హ‌రిత‌హారంలో  9.3 కోట్ల మొక్కలను గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా నాటామ‌ని..ప్రతి గ్రామం లోనూ మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ప్రతి 1000 జనాభాకు ఇద్దరు ఉపాధి కూలీల‌ను ఏడాది పొడ‌వునా పారిశుద్య కార్మికులుగా వినియోగించుకునేందుకు అవ‌కాశం ఇవ్వాలని ఇటీవ‌ల భోపాల్‌లో కేంద్ర మంత్రి తోమ‌ర్‌ను క‌లిసి కోరామ‌న్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *