Breaking News

ఉద్యోగ నియామకాలు అంతా పారదర్శకమే..

ailu-ramesh

-ఘంటా చక్రపాణికి కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఘనంగా సన్మానం
కరీంనగర్, ప్రతినిధి : టీ.ఎస్.పీ.ఎస్.సీ ద్వారా తెలంగాణలో ఉద్యోగ నియామకాలన్నీ పారదర్శకంగా కొనసాగుతాయని టీ.ఎస్.పీ.ఎస్.సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ ఏర్పడి 8 నెలల తర్వాత బాలారిష్టాలన్నీ దాటి నియామకాల ప్రక్రియ మొదలైందని చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడుతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ పబ్బిక్ సర్వీస్ కమిషన్ ఇంకా కుదురుకోలేదని ఉద్యోగుల విభజన జరుగక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దాదాపు 300 ఐఏఎస్, ఐపీఎస్ ల విభజన ఇటీవలే పూర్తయినా.. కిందిస్థాయి ఉద్యోగుల విభజనను కమల్ నాథన్ కమిటీ విభజించలేదన్నారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఆంధ్రావారు ఎక్కువగా ఉన్నారని.. దీంతో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియక ఉద్యోగ ప్రకటన లేట్ అవుతోందన్నారు. ఈ విభజన ప్రక్రియ పూర్తి అయితేనే ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్లు వేస్తామన్నారు.. ఆర్టికల్ 372 అమలైతే నియామకాల్లో గ్రూప్ 1,2 రిజర్వేషన్లు కొనసాగించాలని దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగాల నియామక ఇప్పుడే ప్రారంభమైంది. సింగరేణి.. విద్యుత్, ఇంజనీర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందన్నారు. టీపీఎస్సీ ఉద్యోగుల విభజన మొత్తం పూర్తయితే పని ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ , ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సైతం కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఘంటా చక్రపాణికి అయిలు రమేశ్  ఆధ్వర్యంలో సన్మానం

అనంతరం ఘంటా చక్రపాణిని ఘనంగా సన్మానించారు. ఐజేయూ నాయకులు అయిలు రమేశ్ ఆధ్వర్యంలో శాలువ కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యకుడు కరుణాకర్ , ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, జర్నలిస్ట్ నాయకులు ఎలగందుల రవీందర్, జేబి రాజు,తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *