Breaking News

ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు

unemployed

-ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

తెలంగాణలో ప్రకటించనున్న ఉద్యోగాలకు 5 ఏళ్ల వయోపరిమితినే పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఉపసంఘం తీసుకున్న నిర్ణయంపై  కేసీఆర్ సానుకూలంగా ఉన్నారట.. కానీ కేసీఆర్ పదేళ్ల సడలింపు ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఐదేళ్లకు కుదించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగైదేళ్ల నుంచి ఉద్యోగ నియామకాలు లేవని.. ఐదేళ్లు సడలింపునిస్తే సరిపోతుందని.. పదేళ్ల సడలింపుతో ఉద్యోగాల పరంగా ఇబ్బందులు వస్తాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఇక పోలీస్ శాఖ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచవద్దని ఉపసంఘం అభిప్రాయపడింది. దీంతో నిరుద్యోగులు చాలా నష్టపోనున్నారు.

కేసీఆర్ ఈ నిర్ణయాలను అమలు చేస్తారా.. లేక సవరిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. నిరుద్యోగులు మాత్రం 5 ఏళ్ల సడలింపుపై మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *