
హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఉద్యోగాల పేరుతో అమ్మాయిలకు ఎరవేస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మధు అనే వ్యక్తి ఎఫ్ సి ఐలో చీఫ్ ఇంజనీరుగా ఉద్యోగం చేసేవాడు అయితే అతని ప్రవర్తన నచ్చని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఫేస్ బుక్ లో అమ్మాయిలను టార్గెట్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇప్పటి వరకు దాదాపుగా 300 మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఉద్యోగం పేరుతో అమ్మాయిలపై లైంగికంగా వేధించసాగాడు. దీంతో అతని బాధలు భరించలేక బాధితుల్లో ఒక యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బట్టబయలైంది. నిందితుడి దగ్గర దాదాపుగా 5 వేల మంది అమ్మాయిల ఫోన్ నంబర్లు ఉన్నాయి. అతగాడి వద్ధ నుంచి కొంత నగదుతో పాటు ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. వివిధ పేర్లతో గుర్తింపు కార్డులను సంపాదించి ప్రజలతో పాటు అధికారులను సైతం మోసం చేశాడు ఈ మోసగాడు.