Breaking News

ఉద్యోగనేతకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అవకాశం

kcr deviprasad-02

తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెను ముందుండి నడిపించిన ముగ్గురిలో చివరివాడైన దేవీప్రసాద్ కు అందలం దక్కబోతోంది. మొన్న స్వామి గౌడ్, నిన్న శ్రీనివాసగౌడ్ ఇప్పుడు దేవీ ప్రసాద్.. ఉద్యమ నాయకులకు వరుసగా అవకాశాలు ఇస్తోంది టీఆర్ఎస్ పార్టీ..

టీఎన్జీవో నేత దేవి ప్రసాద్ కే టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా నిలబడే అవకాశం దక్కింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ అభ్యర్థిగా టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవీ ప్రసాద్ పేరును అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆదివారం సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని జిల్లాల మంత్రులతో సమావేశమయ్యారు. అనంతరం దేవీ ప్రసాద్ పేరును ప్రకటించారు.

కాగా నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించడం దాదాపు ఖాయమైంది. సోమవారం ఆశావాహులను కూడా పిలిపించి రాజేశ్వర్ రెడ్డి పేరు ప్రకటించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *