Breaking News

ఉద్యమ నేతకే ‘కరెంట్’ షాక్..

Raghu

తెలంగాణ ఉద్యమంలో వెలుగులోకి వచ్చారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నేత రఘు. ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా ఉధృతంగా పనిచేశారు. తెలంగాణ కోసం బంద్ లు చేసి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను గడగడలాడించన రఘు తెలంగాణ వచ్చాక కూడా అదే ఊపు కొనసాగించాడు. ఇప్పుడు అదే రఘుకు , తెలంగాణ ప్రభుత్వం కష్టాలు తెచ్చిపెట్టింది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. కాగా దాని యూనిట్ విద్యుత్ ధర ఎక్కువగా నిర్ణయించింది చత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఈ విద్యుత్ 10 ఏళ్ల పాటు కొంటే  ఉత్పత్తి వ్యయ భారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం మోయాలని అందులో షరతు పెట్టారు. ఇప్పుడు ఇదే అంశాన్ని విద్యుత్ జేఏసీ నేత రఘు లేవనెత్తారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు కూడా చేశారు..

కాగా ఇలాంటి ఉద్యమ నేతను ముట్టుకుంటే కొంప కొల్లేరవుతుందని భావించిన తెలంగాణ సర్కారు.. ఈఈ గా ఉన్న ఆయన్ను ప్రమోషన్ పేరు తో ఎస్ఈగా పదోన్నతి ఇచ్చి వరంగల్ కు బదిలీ చేసింది. ప్రమోషన్ ఇచ్చి పంపుతున్నట్టు ఆయన పీడను వదిలించుకుంది. మొత్తానికి టీ. ప్రభుత్వం ఉద్యమకారులకు భయపడుతోందని అర్థమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *