
తెలంగాణ ఏర్పడిన తర్వాత బంద్ లు, హర్తాళ్లు.. ఉండవని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది. తెలంగాణ సమాజం ఆందోళన బాట పట్టింది.. కానీ దయ గల కేసీఆర్ సారూ ఏం చేస్తున్నారు. ఆందోళనలను పోలీసుల చేత అణిచివేస్తున్నారు… ఇవాళ ప్రతిపక్షాలన్నీ ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఎన్నో ఆశలతో ఊహించుకున్న కలలు కల్లలైన వేళ.. తెలంగాణ సమాజం రోడ్డున పడింది..
తెలంగాణ అంతటా ఈరోజు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.. రైతు ఆత్మహత్యలను అరికట్టాలని, రుణమాఫీని చేపట్టాలనే నినాదంతో ఆందోళనలు చేశాయి.. కనీసం ప్రభుత్వం స్పందించడం లేదు. పోలీసులను చేతుల్లో పెట్టుకొని కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా ఉద్యమకారులనే అణచివేయాలని చూస్తున్నారు. ఈ పరిణామాలను తెలంగాణ సమాజంలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి..
ఇటీవలే ఆశా కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి బయలు దేరితే దారుణంగా అణగదొక్కారు. ఎక్కడికక్కడ ఆశావర్కర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసించారు. తెలంగాణ మొత్తంగా దాదా 8807మంది ఆశాలను అరెస్ట్ చేసినట్లు డీజీపీనే ప్రకటించడం విశేషం.
ఇంత దుర్మార్గాలు జరుగుతున్నా పత్రికలు, మీడియా కేసీఆర్ కు భయపడి ఆందోళనల వార్తలు దాస్తున్నాయి. దీంతో ఇప్పుడు తెలంగాణ సమాజం నివురు గప్పిన నిప్పులా ఉంది.. ఎప్పుడు బద్దలవుతుందో.. కేసీఆర్ సమస్యలు ఎప్పుడు పరిష్కారిస్తారోనని వేచిచూస్తోంది..