Breaking News

ఉద్యమ చరిత్రను లోకానికి తెలిపిందే ఎడిటర్లే

02-allam-narayana

కరీంనగర్, ప్రతినిధి : పత్రికా బాధ్యతల పరంగా తమ పరిధుల్ని దాటి సైతం ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ చరిత్రను లోకానికి తెలిపిన పత్రికల సంపాదకులు సమాజానికి మార్గదర్శకులు అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం ఫిలింభవన్ లో జరిగిన కే శ్రీనివాస్ గారి పుస్తకాల పరిచయ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీ, తెలంగాణ ఏర్పడకముందే ఎడిటర్ కే.శ్రీనివాస్ సాహసోపేత రచనలు రాశారని కొనియాడారు.

14 సంవత్సరా నుంచి కెఎస్ సైద్దాంతిక ప్రాతిపదికన నిబద్ధత కార్యచరణలతో వ్యాసాలు రాస్తున్నారని.. అవి ప్రజాతంత్ర ఉద్యమాలకు పాఠాలలాంటివని అన్నారు. వ్యాసాలు, పుస్తకాలు చదివితే విశ్వఉద్యమం చేసిన తెలంగాణ మట్టి మహత్తు తెలంగాణ చరిత్రను నమోదు చేసిన వ్యక్తి కేఎస్ అని అల్లం నారాయణ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *