ఉద్యమంగా హరితహరం

ఉద్యమంగా హరితహరం

హరితహరం కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకు సాగుతుందని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. హరితహరాన్ని విజయవంతం చేసేందుకు పోలీస్ శాఖ జిల్లాలో 57గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దత్తత తీసుకున్న గ్రామాల్లో మొక్కలను నాటేందుకు గుంతలు తీసే కార్యక్రమం పూర్తయిందని, హరితహరంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. చిన్నపిల్లలను పెంచినట్లుగానే మొక్కలను నాటాలని, భవిష్యత్ లో మనకు మన పిల్లలు అండగా నిలిచినట్లే మొక్కలు నిలుస్తాయన్నారు. మొక్కలు నాటడం ప్రతి పౌరుని ప్రాధమిక హక్కుగా భావించాలన్నారు. కాలుష్య వాతావరణం తరిమికొట్టి, జీవకోటికి
ప్రాణాధారంగా నిలువాలని చెప్పారు. చెట్ల పెంపకం ద్వారా సహజవాయువులు లభించి, మానసిక ప్రశాంతత లభిస్తుందని తద్వారా క్షణికావేశాలు అదుపులో ఉండి నేరాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. పోలీస్ శాఖ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఒక లక్ష మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అన్ని వర్గాల ప్రజల సహకారంతో సఫలీకృతమవుతామని పేర్కొన్నారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మానవమనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంటింటా చెట్లు- ఊరూరా ఉద్యానవనాల ఏర్పాటు ద్వారా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. హరితహరంపై పోలీస్ శాఖ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అన్ని
వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *