ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తి – మంత్రి హరీష్ రావు

త్వరలో  ఉదయసముద్రం పూర్తి. 

అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తి.

తుది దశలో టన్నెల్ నిర్మాణం.

సబ్ స్టేషన్, విద్యుత్ టవర్లు పూర్తి.

వారంలో పంపులు, మోటార్ల బిగింపు.

ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్ లో సాగుతున్నాయి.త్వరలోనే ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నది. ఫ్లోరైడ్ పీడిత, కరువు పీడిత ప్రాంతాల తాగు, సాగునీటి కోసం ఉద్దేశించిన  ఉదయసముద్రం ప్రాజెక్టు ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఇరిగేషన్ అధికార యంత్రాంగం, ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నాయి.నల్గొండ, నకిరేకల్, మునుగోడు,తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో  లక్ష ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీరందించనున్నది. నల్లగొండ, నార్కెట్ పల్లి, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం,నకిరేకల్ మండలాల్లోని 1 ౦ 7 ఫ్లోరైడు పీడిత గ్రామాలకు సురక్షిత తాగు నీరు అందించనున్నారు.

ఉదయసముద్రం పూర్తయితే నల్లగొండ  నియోజక వర్గంలో 24, 468 ఎకరాలు, నకిరేకల్ నియోజకవర్గం లో 62,476 ఎకరాలు, మునుగోడు లో 10,270 ఎకరాలు, తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంటులో 2,784 ఎకరాలు సాగు లోకి రానున్నవి.ఎట్టి పరిస్తితులలోనూ ఈ ప్రాజెక్టు  యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని
మంత్రి హరీష్ రావు ఇటీవల ఉదయ సముద్రం ప్రాజెక్టును సందర్శించినప్పుడు  ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను  ఆదేశించారు.దీంతో పనులు వేగవంతమైనవి. జనవరిలో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ లోకి
నీరు పడాలన్న  హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ రిజర్వాయర్ పనులు పూర్తి అవుతున్నాయి. 3 . 665 కిలోమీటర్ల పొడవనున్న కాలువకట్ట పనుల్లో  600 మీటర్ల రివిట్ మెంటు పనులు మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయి.6.9 కిలోమీటర్ల ఆప్రోచ్ కెనాల్ పూర్తయింది. ,టన్నెల్ పనులు తుది దశలో ఉన్నవి.1 0. 625 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో 500 మీటర్లు మినహా టన్నెల్ పనులన్నీ పూర్తయ్యాయి.టన్నెల్ లైనింగ్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.

udaya samudram     udaya samudram 3

మోటార్లు, పంపుల బిగింపు పనులు ఈ వారంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు జారుతున్నవి.ఉదయసముద్రం ప్రాజెక్టులో 92 మీటర్ల లోతున  సర్జ్ పూల్  నిర్మాణం పూర్తవుతున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తాగునీటి, సాగునీటి పథకాల పురోగతిని  హరీష్ రావు ప్రతి రోజూ వాట్స్ అప్ లో సమీక్షిస్తున్నారు. అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేస్తున్నారు.కాంగ్రెస్ హయాంలో పంపులు, మోటార్ల కొనుగోళ్ళు తప్ప సర్జ్ పూల్ నిర్మాణం, కాలువల తవ్వకాలు, సివిల్ పనులేవీ సాగలేదు.ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు కావలసిన 220 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణం పనులు  పూర్తయ్యాయి.33 విద్యుత్ టవర్ ల ఎరక్షన్ పనులు పూర్తయ్యాయి.ఉదయ సముద్రం ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద 43, 000 ఎకరాలు, రైట్ మెయిన్ కెనాల్ కింద 57 ,000 ఎకరాలు సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద మొదటి డిస్ట్రిబ్యూటరీ ద్వారా 40 చెరువులను నింపడానికి గాను ఫీడర్ చానళ్ళను తవ్వే పనులు ఊపందుకుంటున్నాయి. ముందుగా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని , 60 చెరువులను నింపాలని  మంత్రి  ఆదేశించారు.

udaya samudram 1 udaya samudram 2

ఈ మేరకు ఆయా పనులకు టైమ్లైను విధించారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తవుతున్నట్టు ఇరిగేషన్ అధికారులు చెప్పారు.50 వేల ఎకరాలకు సాకునీరందించడానికి మొత్తం 1500 ఎకరాల భూసేకరాన్ జరగవలసి ఉన్నది. ఇందులో 450 ఎకరాల భూసేకరణ పెండింగులో ఉంది.మంత్రి హరీష్ రావు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పెండింగ్ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు.ఇక నల్లగొండ , కట్టంగూరు మధ్య అప్రోచ్ చానల్ పై 3.165 కిలోమీటర్ల మేర డబుల్ లైను రోడ్ బ్రిడ్జి పనులు వేగవంతం చేసారు. ఈ రోడ్ బ్రిడ్జి నిర్మాణం నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *